business
NARAYANA INSPECTION AMARAVATI WORKS
Amaravati steel bridges inauguration : రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలు రేపు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవ ఏర్పాట్లును మంత్రి నారాయణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటితోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌ను కూడా సీఎం పరిశీలించనున్నట్లు తెలిపారు. 110 మీటర్ల పొడవుతో బకింగ్ హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు ఛానల్‌పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. రేపటి నుంచి విజయవాడ, మంగళగిరి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదగా నేరుగా ప్రయాణం చేయవచ్చు. అమరావతికి స్వాగతం పలికేలా స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేశారు.
Read full article on Etv Bharat