business
INDIRAMMA HOUSING TOWERS
Indiramma Housing Towers in Hyderabad : క్యూర్(హైదరాబాద్) పరిధిలో తొలి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పనులకు కూకట్‌పల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఐదు ఎకరాల్లో నాలుగు టవర్లు నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో టవర్‌లో 120 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఇలా మొత్తం 480 ఫ్లాట్ల నిర్మాణం చేస్తారు. దీని కోసం రూ.43.20 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 16 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్లతో వీటిని చేపడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను కేటాయించాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు దిల్లీలో ఆయన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆవాస్ ప్లస్- 2024 యాప్ ద్వారా పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని ఇందులో 11.56 లక్షలకుపైగా కుటుంబాలు ఇళ్లకు అర్హమైనవిగా తేలిందని వివరించారు.
Read full article on Etv Bharat